సెర్ప్ డీపీఎం శేఖర్
తాండూరు రూరల్: స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభు త్వ లక్ష్యమని సెర్ప్ డీపీఎం శేఖర్ అన్నారు. సోమవారం తాండూరులోని ఐకేపీ కార్యాలయంలో తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన వీఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం ‘లఖ్‌పతి దీదీ’ పేరిట పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మహిళలకు జీవనోపాధి మార్గాలపై అవగాహన కల్పించి, ఏడాదికి రూ.లక్ష ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలు బాలయ్య, శివ, మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు భగ్యలక్ష్మి, సీసీలు ప్రభు, సంధ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక మాఫియాను అడ్డుకోండి
ప్రజాసంఘాల నాయకులు
తాండూరు టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియా సభ్యుల ఆగడాలను అడ్డుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఇరిగేషన్ డీఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ పరిధిలోని శివసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు ఇంకిపోయి రైతన్నల పాలిట శాపంగా మారిందన్నారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకొని, జెసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, చంద్రయ్య, అబ్దుల్ వాహబ్, రత్నం, రఘుపతి, యాదగిరి, గౌతమ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి కలిసి రావాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట: మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని చిట్టిగిద్ద, నవాబుపేట, ఎత్రాజ్పల్లి, వట్టి మీనాపల్లి, దాతాపూర్, గంగ్యాడ, నారెగూడ, పూలపల్లి గ్రామాల్లో సోమవారం సీసీ రోడ్లు, ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. రూ.2 కోట్ల 50 లక్షలతో అంతర్గత మురుగు కాలువల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి కలిసి వస్తే తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పాలసీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బలవంత రెడ్డి, సర్పంచులు శ్రీధర్, నరసింహారెడ్డి, జగన్ రెడ్డి, మానెమ్మ, మల్లేశం, దీపిక, భాగ్యలక్ష్మి, కిష్టయ్య, సంతోష్ రెడ్డి, శేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, రామ్‌రెడ్డి, నాగిరెడ్డి, ఎక్ బాల్, మల్లేశం, దశరథ్, మహేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాణిక్యం, రాములు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.


