హక్కులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హక్కులపై అవగాహన అవసరం

Nov 24 2026 4:16 PM | Updated on Nov 24 2026 4:16 PM

● మానవ హక్కుల సంఘం జిల్లా చైర్మన్‌, న్యాయవాది శ్రీనివాసులు ఆనంద్‌

కొడంగల్‌ రూరల్‌: ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలని సంఘం జిల్లా చైర్మన్‌, న్యాయవాది శ్రీనివాసులు ఆనంద్‌ అన్నా రు. సోమవారం జిల్లా వైస్‌ చైర్మన్‌ ఎస్‌ బాసప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమానికి సహకరించిన ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, డాక్టర్‌ సాకేత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి మనిషికి కులం, మతం, జాతి, వర్ణం అనే బేదం లేకుండా మానవ హక్కులను చట్టంలో పొందుపరిచారని తెలిపారు. చట్టాలపై అవగాహన ఉంటే మోసపోయేందుకు ఆస్కారం ఉండదన్నారు. చదువుకున్న యువతీ యువకులు చట్టాల గురించి తెలుసుకొని గ్రామాల్లో వివరించాలని సూచించారు. సంస్థలోని ప్రతి సభ్యుడు క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతతో పనిచేయాలని, పేదలు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా నిలవాలన్నారు. న్యాయం కోసం నిలబడటం, సమాజంలో శాంతి, సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, ఉచిత న్యాయ అవగాహన సదస్సు లు నిర్వహించేందుకు సంస్థ సభ్యులు కృషి చేయా లని తెలిపారు.కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజు నరసింహులు, జిల్లా వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ రషీద పాషా, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement