మహిమాన్వితం శనైశ్చరాలయం | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం శనైశ్చరాలయం

Nov 24 2026 4:16 PM | Updated on Nov 24 2026 4:16 PM

● స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మోమిన్‌పేట: ఎన్కతలలో కొలువుదీరిన శనీశ్వరుడు మహిమాన్విత స్వామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని, ఆలయ ప్రాంగణంలో నూతన కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి తన వంతుసహకారం అందిస్తానని అన్నారు. గ్రామం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావడంతో అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరవుతాయని తెలిపారు. నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. చైర్మన్‌గా బీ శ్రీనివాస్‌రెడ్డితో ప్రమా ణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీకాంత్‌ గౌడ్‌, మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, మేకవనంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ శంకర్‌, మోమిన్‌పేట పీఏసీఎస్‌ చైర్మన్‌ నరోత్తంరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement