పహాడీషరీఫ్: స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంతో స్థానికులు భయాదోళనకు గురైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలో కొంత మంది నివాసాల నడుమ అనధికారికంగా పెద్ద ఎత్తున స్క్రాప్ గోదాంలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లా అనే వ్యక్తికి సంబంధించిన గోదాంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి స్థానికులు తీవ్ర భయాదోళనకు గురయ్యారు. సమాచారం అందుకు న్న పోలీసులు రెండు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగిందా.. లేక స్క్రాప్‌లో ఏదైనా పేలుడు స్వభావం కలిగిన పదార్థం కారణంగా జరిగిందా.. అని తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


