విధులను నిర్లక్ష్యం చేస్తున్నవారిపై చర్యలకు వినతి | - | Sakshi
Sakshi News home page

విధులను నిర్లక్ష్యం చేస్తున్నవారిపై చర్యలకు వినతి

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

తాండూరు: మాతాశిశు ఆస్పత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకుడు భానుకుమార్‌, అంబేడ్కర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తాండూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజా మాలిక్‌కు వినతిపత్రం అందించారు. గత మూడు రోజులుగా మాతాశిశు ఆస్పత్రిలో చోటు చేసుకుంటున్న మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బుడగజంగం వెంకటేశ్‌, శంకర్‌, రాముగౌడ్‌, మహేశ్‌, బంటి ఉన్నారు.

గంజాయి స్వాధీనం

పోలీసుల అదుపులో ముగ్గురు

షాబాద్‌: మండల పరిధిలోని మాచన్‌పల్లి శివారులో సోమవారం షాబాద్‌ పోలీసులు దాడి నిర్వహించి 57 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మాచన్‌పల్లి శివారులో తనిఖీలు చేపట్టగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షానికుమన్‌ గోండ్‌, బ్రిజేంద్ర విశ్వకర్మ, మరో 17 ఏళ్ల బాలుడు పట్టుబడ్డారు. వీరు ప్రస్తుతం మండల పరిధిలోని హైతాబాద్‌లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారి నుంచి 57 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బైకులు ఢీకొని వ్యక్తికి గాయాలు

కొడంగల్‌: పట్టణ శివారులోని సిద్దార్థ పాఠశాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు సోమవారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ఘటనలో దౌల్తాబాద్‌ మండలం నీటూరు గ్రామానికి చెందిన మొగులప్ప (38) గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

పాఠశాల ఆవరణలో

డీజే సౌండ్‌

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

మొయినాబాద్‌: ప్రైవేటు పాఠశాల ఆవరణలో ఉన్న క్రికెట్‌ గ్రౌండ్‌లో డీజే సౌండ్‌ పెట్టి విద్యార్థులకు అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులు పెడుతున్న యాజమాన్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో ఉన్న పల్లవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆవరణలో క్రికెట్‌ గ్రౌండ్‌ ఉంది. ఈ నెల 3న అథ్లెటిక్‌ సొసైటీ, పల్లవి స్కూల్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో డీజే సౌండ్‌ పెట్టి పెద్ద శబ్దాలు పెట్టారు. అదే సమయంలో పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అంతరాయం ఏర్పడి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో డీజే సౌండ్‌ పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు సోమవారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

కారు ఢీ.. వాహనదారుడికి

తీవ్ర గాయాలు

పహాడీషరీఫ్‌: ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గా యాలపాలైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల కాలనీకి చెందిన గోవింద్‌ దేవకాంత్‌(28) కోకా పేటలోని విల్లాస్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నా డు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 8.30 గంటలకు తన ద్విచక్ర వాహనంపై మామిడిపల్లి హిల్స్‌ రోడ్డులో వెళ్తున్నాడు. ఈ సమయంలో ఎదు రుగా వేగంగా వచ్చిన ఊబర్‌ కారు ఢీ కొట్టడంతో వెన్నెముక, ఇతర భాగాలలో తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రు డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

అడ్డగుట్ట: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్‌లోని బాబా నగర్‌ హౌసింగ్‌ సొసైటీలో నివాసం ఉంటున్న మంచాల పురుషోత్తం(59) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ టైలర్‌ పని కూడా చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం చర్లపల్లి–మౌలాలి రైల్వే స్టేషన్ల మార్గం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement