పొగబెట్టినా పోవే! | - | Sakshi
Sakshi News home page

పొగబెట్టినా పోవే!

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

ఫాగింగ్‌ చేస్తున్నా తగ్గని దోమల విజృంభణ

దౌల్తాబాద్‌: పొమ్మనలేక పొగబెట్టారని ఓ సామెత. కానీ ఇందుకు విరుద్ధంగా పొమ్మని పొగబెడుతున్నా దోమలు మాత్రం పోవడంలేదు. వానాకాలం సీజన్‌లో సాధారణంగా వీటి వ్యాప్తి పెరుగుతుంది. కానీ ఈఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోయినా కూడా దోమల బెడద తప్పడంలేదు. గతంకంటే భిన్నంగా రాత్రి పూటే కాకుండా పగలు సమయంలోనూ స్వైరవిహారం చేస్తూ రక్తాన్ని పీల్చేస్తున్నాయి.

మేజర్‌ గ్రామాల్లో..

మండలంలో 33 పంచాయతీలు ఉన్నాయి. మేజర్‌ గ్రామాల్లో మురుగు రోడ్లపై నిల్వ ఉండడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి. డ్రైనేజీ సమస్యే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భారీ వర్షాలు కురిస్తే డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు కొట్టుకుపోయేది. కానీ ఈసారి వరద పారిన వర్షాలు పెద్దగా లేవు. డ్రైనేజీల్లో నిండిపోయిన మురుగు, మురికి నీరు దోమలకు ఆవాసంగా మారాయి.

ఫాగింగ్‌ చేస్తున్నా..

గ్రామాల్లో ఉన్న జనాభా, వార్డుల ఆధారంగా ఫాగింగ్‌ చేస్తున్నప్పటికీ దోమల తీవ్రత తగ్గడంలేదు. సాధారణంగా ప్రతీ ఏడాది వర్షం కురిసిన మరుసటి రెండు రోజుల్లో ఫాగింగ్‌ చేయడం సహజం, కానీ ఈసారి ప్రతికూల వర్షాల కారణంగా వానాకాలం సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఫాగింగ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ దోమల బెడద తగ్గడం లేదంటున్నారు. ఫాగింగ్‌ పెంచాలని అప్పుడైనా వీటి తీవ్రతా తగ్గుతుందేమోనని ప్రజలు అంటున్నారు. దోమల విజృంభణతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న వ్యాప్తి

కంటిమీద కునుకు లేదంటున్న ప్రజలు

రోగాలబారిన పడుతున్నామని ఆవేదన

విపరీతంగా పెరిగాయి

సాధారణంగా వర్షాకాలంలో ఉండే దోమల కంటే ఈసారి ఎక్కువగా ఉన్నాయి. అధికారులు ఫాగింగ్‌ చేసినా కూడా తీవ్రత తగ్గడంలేదు. మురుగు కాల్వలు కూడా కారణమే. వర్షాలు లేకుంటే కూడా ఇలా ఉంటాయని పెద్దలు చెప్పేవారు. ఫాగింగ్‌ మరింత పెంచాలి. – నరేష్‌, దౌల్తాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement