మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి అర్జీలపై ఫోన్‌ నంబర్‌ రాయండి ఏఎంసీ అభివృద్ధికి రూ.2.62 కోట్లు పదేళ్లలో రాష్ట్రం లూటీ

బంట్వారం: మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ పెండ్యాల చంద్రకిరణ్‌ అన్నారు. సోమవారం కోట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. చిన్నచిన్న సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమంత్‌, తహసీల్దార్‌ అనంద్‌రావు, ఎంపీఓ సురేందర్‌రెడ్డి, ఎంఈఓ చంద్రప్ప, మెడికల్‌ ఆఫీసర్‌ మేఘన, వెటర్నరీ ఎల్‌ఎస్‌ఏ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మర్పల్లి: ప్రజావాణిలో ఇచ్చిన ప్రతీ ఫిర్యాదును తప్పకుండా పరిష్కరిస్తామని మర్పల్లి ఎంపీడీఓ శాంత అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు ఇచ్చే అర్జీపై విధిగా ఫోన్‌ నంబర్‌ రాయాలని సూచించారు. పక్షం రోజుల్లో సంబంధిత శాఖ అధికారులు సమస్యను పరిష్కరిస్తారని లేదా వివరణ ఇస్తారని తెలిపారు. డీటీ పరశురామ్‌, ఎంపీఓ శ్రీనివాస్‌, ఏఓ శ్రీకాంత్‌, ఏపీఎం సమ్మయ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ మార్కెట్‌ యార్డు, రైతు బజార్‌లో పలు అభివృద్ధి పనులకు రూ.2.62 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. శాసన సభాపతి ప్రసాద్‌ కుమార్‌ చొరవతో ఐదు అభివృద్ధి పనులకు వ్యవసాయ, సహకార శాఖ అనుమతులు జారీ చేసింది. మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మంజూరైన పనుల్లో మార్కెట్‌ యార్డులో కార్యాలయ భవనం పక్కన 16 వాణిజ్య దుకాణాల నిర్మాణానికి రూ.1.75 కోట్లు, ఇప్పటికే ఉన్న ఓపెన్‌ ప్లాట్‌ఫాంపై కవర్డ్‌ ప్లాట్‌ఫాం నిర్మాణానికి రూ.42 లక్షలు కేటాయించారు. అలాగే మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.25.25 లక్షలు, మార్కెట్‌ యార్డులో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌కు రూ.10 లక్షలు, రైతుబజార్‌లో మరో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయించారు. త్వరలోనే ఈ పనులను చేపట్టనుండటంతో రైతుబజార్‌లో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం: తెలంగాణ పేరుతో పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ పాలకులు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ఆయన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపినీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురై, రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. పేదలకు ఒక్క రేషన్‌ కాడ్డూ ఇవ్వలేదన్నారు. నేటి ప్రజా పాలనలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను రేవంత్‌ సర్కార్‌ పంపిణీ చేస్తోందని చెప్పారు. మరింత సులభంగా, పారదర్శకంగా, ప్రభుత్వ సేవలు అందేలా స్మార్ట్‌ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు దక్కేలా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ సునితారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement