తాండూరు రూరల్: పార్టీ కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ అన్నారు. పెద్దేముల్‌లోని రైతు సేవా సహకార సంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్లు సోమవారం తాండూరులోని తన నివాసంలో ధారాసింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవులు పొందిన నాయకులు ప్రజల్లో ఉంటూ సేవలందించాలని సూచించారు. అనంతరం కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన కందనెల్లి గ్రామానికి చెందిన మధులతశ్రీనివాస్‌చారి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్
పీఏసీఎస్ నూతన కమిటీకి సన్మానం
పదవులు పొందిన నేతలు ప్రజల్లో ఉండాలని పిలుపు


