ప్రజావాణి వినాల్సిందే | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి వినాల్సిందే

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

అనంతగిరి: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. గైర్హాజరైన సంబంధిత అధికారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 103 అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమయానికి హాజరై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోపు క్లియర్‌ చేయాలని లేదా దరఖాస్తు దారుడికి సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గైర్హాజరైన వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా కార్మిక శాఖ అధికారికి సంబంధిత అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్డీఏ శ్రీనివాస్‌, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గైర్హాజరైతే చర్యలు తప్పవు

కలెక్టర్‌ దీపక్‌ తివారి

ప్రజల నుంచి 103 అర్జీల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement