షాద్‌నగర్‌రూరల్: కురిసిన ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపట్టుకొని, నీటి సమస్యను ఎదుర్కొందామని డీపీఓ సురేష్‌మోహన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో నీటి మట్టం తగ్గిపోతోందని, భూగర్భ జలాలను పెంచుకునేందుకు ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతీ పంచాయతీ 200 ఇంకుడు గుంతలు, పొలాల్లో రైతులు నీటి కుంటలు, వర్షపు నీరు వృథా పోకుండా ఊట కుంటలను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వీబీజీరాం పథకం ద్వారా ఈ పనులను అక్టోబర్ వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం జలసిరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ నాగయ్య, పీఆర్ ఏఈ గోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఏపీఓ అరుణ, ఏపీఎం జంగయ్య, ఉద్యనశాఖ అధికారి హిమబిందు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీపీఓ సురేష్‌మోహన్


