వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి

Jul 24 2026 7:25 AM | Updated on Jul 24 2026 7:25 AM

సాక్షి, సిటీబ్యూరో: కళాశాల స్థాయిలో విద్యతో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లో ‘ఒయాసిస్‌ ఫెర్టిలిటీ’ ఏర్పాటు చేసిన జననీ డైలాగ్స్‌– 2026 ప్యానల్‌ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ వైద్యారోగ్య శాఖలో నేను పనిచేశాను. ఫెర్టిలిటీ సమస్యలపై నాకు అవగాహన ఉంది. లైఫ్‌ స్టైల్‌ మార్పులు, ఆహారపు అలవాట్లు ప్రభావం చూపిస్తున్నాయి. ఫెర్టిలిటీ సమస్యలు ఎదురైనపుడు ఐవీఎఫ్‌, ఇతర అధునాతన పద్ధతుల వైపు చూస్తున్నారు.. పిల్లలు కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే తల్లిదండ్రులు ఐఐటీ, మెడికల్‌ సీటు కోసం ఆరాటపడుతున్నారు. శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. దక్షిణ భారతంలో ఇంటర్‌ విద్యార్థులు 17 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. శారీరక వ్యాయామానికి సమయం ఇవ్వడంలేదు. ఇది దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను చూపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం అధికారి డా.ఎన్‌ సుమలత, ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కో– ఫౌండర్‌ జి.కిరణ్‌, డైరెక్టర్లు హరిప్రసాద్‌, దుర్గారావు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement