కొడంగల్ రూరల్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ అభిమాని తమ్మళి బాల్‌రాజ్ కలిశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
పేలిన గ్యాస్ సిలిండర్
పరిగి: పట్టణంలోని ఓ హోటల్‌లో గురువారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై ంది. గమనించిన నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారని హోటల్ నిర్వాహకులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
గేదె మృతి
యాలాల: విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కమాల్‌పూర్ శివారులో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని నర్సింహులుకు చెందిన గేదెను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులో పౌల్ట్రీ షెడ్డు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు బాధిత రైతు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ వృద్ధుడి (సుమారు 70 ఏళ్లు) మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడిని మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పూర్యా నాయక్‌గా గుర్తించారు. అక్కడున్న సీసీ పుటేజీలను పరిశీలించగా వృద్ధుడిని ఓ యువకుడు కాళ్లతో తంతున్నట్లు నమోదైంది. ఆ యువకుడి కారణంగానే వృద్ధుడు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ట్రాక్టర్ యజమానిపై కేసు
బొంరాస్‌పేట: విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని మహంతీపూర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దండ్ల జనార్దన్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని మహేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కొందుర్గు: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహ్మద్ కుర్షీద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు శుక్ర, శనివారం నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు 10వ తరగతిడ మెమో, కుల, ఆదాయం సర్టిఫికెట్లు జిరాక్స్ ప్రతులను జతచేసి మధ్యాహ్నం 1 గంటలలోపు అందజేయాలన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్ల కేటాయింపు ఉంటుందని సూచించారు.


