ఉచిత వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్య శిబిరం

Jul 24 2026 7:25 AM | Updated on Jul 24 2026 7:25 AM

కేశంపేట: రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని లిమ్స్‌ న్యూరో కార్డియో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వారు కేశంపేటలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కేశంపేట గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 300 మంది రోగులు పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ చైర్మన్‌ భీమ్‌రెడ్డి, శ్రీశైలం, స్వచ్ఛంద సేవకులు ప్రవీణ, జ్యోతి, వేంకటేశ్వర్‌రావు, రామోదర్‌రెడ్డి, భీమయ్య, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement