ఎడ్యుకేషన్‌ హబ్‌పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్‌ హబ్‌పనుల పరిశీలన

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

కొడంగల్‌: దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారులో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనుల పురోగతిని అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ శనివారం పరిశీలించారు. వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కళాశాలలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌, ఏటీసీ, సైనిక్‌ స్కూల్‌, వెటర్నరీ కళాశాల, 430 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌, డీఈ రాజయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

గడువు పొడిగింపు

తాండూరు: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీలో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు పీపుల్స్‌ డిగ్రీ కళాశాల కో ఆర్డినేటర్‌ నాగేశ్వర్‌ చారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్‌, ఐటీఐ, ఓపెన్‌ ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఓపెన్‌ డిగ్రీలో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో నేరుగా సంప్రదించాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

పరిగి: తాత్కాలిక ప్రాతిపదికన స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం శ్రీ నస్కల్‌ కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తుంకుల్‌గడ్డలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయం, ప్రత్యేక సేవలు అందించేందుకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులని, ఈ నెల 7వ తేదీలోగా పీఎం శ్రీ పాఠశాలలో దరఖాస్తు చేయాలన్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణం

కొడంగల్‌: దుద్యాల మండలం మామిడికుంట ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్‌ చాలీసా పారాయాణాన్ని పఠించారు. 36 వారాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం పారాయణం నిర్వహిస్తున్నట్లు భజన మండలి భక్తులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు ఆవుటి రాజ్‌కుమార్‌, హనుమంతు, పకీరప్ప, రాజు, రతన్‌లాల్‌, గోపి, కుర్వ రమేష్‌, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

బార్‌ కోసందరఖాస్తు చేసుకోవాలి

కొడంగల్‌: పట్టణానికి మంజూరైన బార్‌ కోసం ఆసక్తి గల వారు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ వీరారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రుసుం రూ.లక్ష ఉంటుందన్నారు. జాతీయ బ్యాంకులో డీడీ తీసి సమర్పించాలన్నారు. మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, పాన్‌, ఆధార్‌కార్డు జిరాక్సులు ఇవ్వాలన్నారు.

సహకార సంఘాన్ని

సందర్శించిన డీసీఓ

కొడంగల్‌: పట్టణంలోని లాహోటీ కాలనీలో ఉన్న హస్నాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. సంఘంలో ఉన్న సభ్యత్వాలు, రికార్డులను పరిశీలించారు. వామ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వామ పొలాలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈఓ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement