కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

● ఇంటర్మీడియల్‌ విద్యాశాఖ జిల్లా అధికారి శంకర్‌నాయక్‌

పరిగి: విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ జిల్లా అధికారి శంకర్‌నాయక్‌ సూచించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు భాషా శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్ధ వార్షిక పరీక్షలు ప్రారంభమైనందున విద్యార్థులు మంచి ఫలితాలు వచ్చేలా చదువుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. కష్టపడి చదివిన వారు భవిష్యత్తులో ఉన్నత స్థానం ఉంటారని తెలిపారు. భవిష్యత్తులో ఏ రంగంలో రాణించాలన్నా ఇంటర్మీడియట్‌ కీలకమన్నారు. ప్రతి విద్యార్థికీ అర్థఽమయ్యోలా బోధన చేసి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కార్చాచరణ రూపొందించాలని సిబ్బందికి సూచించారు. కళాశాల నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా భాస్కరయోగికి అవార్డు రావడం ఎంతో సంతోషించ దగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు రాజేష్‌కుమార్‌, సతీష్‌, గణేశ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement