ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ ఆరాటం | - | Sakshi
Sakshi News home page

ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ ఆరాటం

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

దళిత బంధు కమీషన్‌తో పార్టీలు చేసుకున్నారు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేరు తీస్తే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు

యాలాల: రాజకీయ ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ నా యకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజల నాయకుడైన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేరు అనవసర విషయాల్లో తీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని సొసైటీ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌, సొసైటీ మాజీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం లక్ష్మీనారాయణపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇంటిగ్రెటె డ్‌ పాఠశాల నిర్మాణానికి పనులు కొనసాగుతుండగా, బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొసైటీ రైసుమిల్లు నిర్మాణంలో రూ.2.50 కోట్లలో రూ.2 కోట్ల తో గోదాం నిర్మాణం పూర్తయిందని, రూ.50 లక్షల మిషనరీ పనులు ఇంకా చేపట్టాల్సి ఉందన్నారు. అయినప్పటికి రైసుమిల్లు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు. మొన్నటివరకు పాలకవర్గంలో ఉన్న సొసైటీ మాజీ వైస్‌ చైర్మన్‌ రాములు.. పదవీ పోయాక అక్రమాలు జరిగాయని పేర్కొనడం తప్పన్నారు. త్రీమెన్‌ కమిటీ(చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, సీఈఓ) ఆధ్వర్యంలో సొసైటీ బిల్లులు మంజూరు అవుతాయనే విషయం అందరికి తెలుసన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హ యాంలో దళితబంధు మంజూరు చేయిస్తామని చెప్పి, ఒక్కొక్కరి వద్ద భారీ మొత్తంలో వసూలు చేసిన ఆ పార్టీ నాయకులు సోమశిలలో పార్టీ చేసుకున్నారని ఆరోపించారు. దళితబంధు బాధితులు లిస్టు తమ వద్ద ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ నాయకులు నర్సిరెడ్డి, అమృతయ్య, మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వీరేశం ముదిరాజ్‌, మత్స్యశాఖ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌, తిమ్మాయిపల్లి సర్పంచ్‌ అమర్‌నాథ్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్‌చారి, అమర్‌, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇంచార్జీ గాజుల మన్నాన్‌, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement