తాండూరు రూరల్: మహిళా సంఘాల్లోని సభ్యులు ఎఫ్‌పీసీ(రైతు ఉత్పత్తిదారుల కంపెనీ)లో చేరి వ్యాపార వేత్తలుగా ఎదగాలని సెర్ప్ డీపీఎం శేఖర్ అన్నారు. బుధవారం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఎఫ్‌పీసీ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొంరాస్‌పేట్, కుల్కచర్ల, వికారాబాద్, మోమిన్‌పేట్, తాండూరు మండలాల్లో ఎఫ్‌పీసీలు కొనసాగుతున్నాయని చెప్పారు. తాండూరు మండలంలో 854 మంది సభ్వత్వం పొందినట్లు తెలిపారు. ఎఫ్‌పీసీ ద్వారా రూ.1.78 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. అంతారం గ్రామ సమీపంలో రూ.52 లక్షలతో మినీ దాల్‌మిల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి మిల్లులో పప్పుగా మార్చి మార్కెట్లకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాలయ్య, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమ్మ, సీసీలు సత్యనారాయణ, బందెప్ప, శంకర్, సిబ్బంది కవిత, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ డీపీఎం శేఖర్
తాండూరులో ఎఫ్‌పీసీ వార్షిక సమావేశం


