బంట్వారం: పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం బంట్వారం, సల్బత్తాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇళ్లు మంజూరైన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. బిల్లులు జాప్యం కాకుండా చూసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడే ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, సీనియర్ నాయకులు పురుషోత్తంరెడ్డి, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ నాగరాజు, సల్బత్తాపూర్ సర్పంచ్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్


