తాండూరు: బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను గురువారం తాండూరు పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పట్టణానికి చెందిన దత్తాత్రేయరావు, వినోద్‌కుమార్‌ను తెల్లవారుజామున అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యారంగాన్ని గాలికి వదిలేదసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.


