అటవీ భూమి ఆక్రమణపై సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

అటవీ భూమి ఆక్రమణపై సీరియస్‌

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

బషీరాబాద్‌: మండలంలోని మైల్వార్‌ రిజర్వు ఫారెస్టులో ప్రభుత్వ అటవీ భూమిని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నంపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అటవీ సంరక్షణలో భాగంగా తవ్విన ఇంకుడు గుంతలను పూడ్చి కబ్జా చేసేందుకు యత్నించిన కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా ఇందిరానగర్‌ తండాకు చెందిన శంకర్‌ నాయక్‌, రవి సర్దార్‌, హన్మ్యానాయక్‌లపై ఫారెస్టు సెక్షన్‌ అధికారిణి స్నేహశ్రీ బుధవారం కోర్టు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ మల్లప్పతో కలిసి బషీరాబాద్‌ ఎస్‌ఐ విట్టల్‌ సహకారంతో ఇందిరానగర్‌ తండాలో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బుధవారం శంకర్‌ నాయక్‌ను ఠానాకు రావడంతో సెక్షన్‌ అధికారి నోటీసులు అందజేశారు. రిజర్వు ఫారెస్టు భూములపై అక్రమ ఆక్రమణలను సహించబోమని, అటవీ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణను అధికారులు మరింత ముమ్మరం చేశారు.

ఇంకుడు గుంతలు మూసివేసి

కబ్జాకు యత్నం

ముగ్గురు కర్ణాటక వాసులపై

కేసులు నమోదు

నోటీసులు జారీ చేసిన సెక్షన్‌ ఆఫీసర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement