నీట్.. ఫట్!
ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు పరీక్ష రద్దు ప్రకటనతో ఆందోళనకు గురయ్యారు. ఎగ్జామ్ బాగా రాసి, ర్యాంకుపై ఆశలు పెట్టుకున్న వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
– ధారూరు, దుద్యాల, దోమ
లీకై న చోటే రద్దు చేయాలి
నీట్ పరీక్ష పేపర్ ఎక్కడ లీకై తే అక్కడే పరీక్ష నిర్వహించాలి. పరీక్ష బాగా రాసి, సీటు వస్తుందనే ధీమాతో ఉన్న సమయంలో కేంద్రం చేసిన ప్రకటన కుంగదీసింది.
– లక్ష్మీప్రసన్న, ధర్మాపూర్, ధారూరు మండలం
రద్దుతో చాలా నష్టపోతున్నాం
కీ పేపర్ చూసుకుని బెస్ట్ ర్యాంక్ వస్తుందని చాలా సంతోషపడ్డా. ఆ ఆనందం ఇలా ఆవిరైపోతుందనుకోలేదు. మళ్లీ పేపర్ ఎలా వస్తుందో.. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్ మొదలైంది. – నిఖిల్, బొంపల్లి, దోమ మండలం
లాంగ్‌టర్మ్ తీసుకున్నా..
నేను 2025లో ఇంటర్ పూర్తి చేశా. అప్పుడు నీట్ పరీక్ష రోజే మా తాత మరణించడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయా. అనంతరం ఏడాది పాటు లాంగ్ టర్మ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. మంచి ర్యాంక్ వస్తుందని ఆశించా. చాలా బాధగా ఉంది.
– నవీన, హస్నాబాద్, దుద్యాల మండలం


