రెండు గంటల్లో బాలుడి ఆచూకీ | - | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లో బాలుడి ఆచూకీ

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలో బుధవారం సాయంత్రం ఓ బాలుడు తప్పిపోయాడు. ఈ విషయం సోషల్‌ మీడియా వేదికగా పోలీసులు పోస్ట్‌ చేయడంతో అదికాస్తా అన్ని గ్రూపుల్లో చకచకా ఫార్వర్డ్‌ కాగా రెండు గంటల్లోనే బాలుని ఆచూకీ లభించింది. పట్టణంలోని పురుషోత్తం ఆస్పత్రి వెనుక గల్లీలో నివాసం ఉండే బాబు ఇంటి పరిసరాల్లో నుంచి తప్పిపోయాడు, చుట్టూ పక్కల వెతికిన ఫలితం లేకపోవడతో పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే సోషల్‌ మీడియాలో సమాచారం ఫార్వర్డ్‌ చేశారు. కాగా బాలునికి మాటలు రాకపోవడంతో ఏం చెప్పలేకపోయాడు. కాసేపటికి బాబు రాజీవ్‌గృహ కల్ప సమీపంలో ఉన్నట్లు తెలియడంతో వారు బాబును పీఎస్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు, దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటల్లోపే చిన్నారి ఆచూకీ తెలిసినందుకు అందరం సంతోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement