‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి

Jul 28 2025 12:16 PM | Updated on Jul 28 2025 12:16 PM

‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి

‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి

చేవెళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీరంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌ గౌడ్‌ అన్నారు. ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నద్ధత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్‌భూపాల్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం ఎన్నికల వ్యుహాలను వివరించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపితేనే నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాములుగౌడ్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్‌, మండల ప్రభారి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడుబి.కుమార్‌ గౌడ్‌, వాసుదేవ్‌ కన్నా, మండల నాయకులు, బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధే ప్రధాని లక్ష్యం

మొయినాబాద్‌రూరల్‌: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ భూపాల్‌ గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాంనగర్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం అన్నారు. ఆదివారం నరేంద్రమోదీ నిర్వహించిన మన్‌కీ బాత్‌ను వారు పార్టీ కార్యాలయంలో వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యంత విశ్వసనీయత కలిగిన నేత మోదీ అన్నారు. అమెరికాకుచెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థ చేపట్టిన సర్వేలో ప్రధానికి ప్రపంచంలో 75 శాతం అప్రూవల్‌ రేటింగ్‌వచ్చిందని చెప్పారు. మన్‌కీబాత్‌లో మోదీ మాట్లాడుతూ.. మన సంస్కృతిలో విజ్ఞానం దాగి ఉందని, అంతరిక్షంలోకి వెళ్లిన శుభాన్ష్‌ శుక్లా సురక్షితంగా తిరిగి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారని వివరించారు.వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ను అలవాటు చేసుకోవాలని సూచించారన్నారు. కార్యక్రమంలో ఓబీసీ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశ్‌ గౌడ్‌, నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రంగారెడ్డి జిల్లా

అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement