
నూనె గింజల సాగుతో రాబడి
షాబాద్: నూనె గింజల సాగుతో అధిక దిగుబడి సాధించడంతో పాటు.. లాభాలు అదే విధంగా పొందవచ్చని నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్.కె.మథుర్, కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్‌రావు అన్నారు. శుక్రవారం భారతీయ నూనే గింజల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్‌లో 49వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా సాగుపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గింజల సాగుతో అధిక దిగుబడి సాధించిన తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ రైతులు సుగుణమ్మ, నర్సమ్మ, మాణిక్యంలను సన్మానించారు. అనంతరం సంస్థ నుంచి అధిక దిగుబడి ఇచ్చే కుసుమ రకాలు, ఆదాయ మార్గాల గురించి వివరించారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ, మిట్టకంకల్ రైతులు శ్రీనివాస్, మాణిక్యం, సుగుణమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.