
ఎల్‌పీజీ మంజూరు చేయండి
ఎంపీ డీకే అరుణ
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గానికి ఎల్‌పీ జీ పెట్రోల్ పంపులు మంజూరు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్ పర్సన్ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హరిదీప్ సింగ్‌పూరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎల్‌పీజీ పంపు లేదని మంత్రికి వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎల్‌పీజీ, పెట్రోల్ పంపులు అందుబాటులోకి తేవాలని కోరారు.
నేడు హిందూ ఉత్సవ సమితి భవనానికి శంకుస్థాపన
తాండూరు: పట్టణంలో హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన రెండెకరాల స్థలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.50 లక్షలతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కుల సంఘాల సభ్యులు, హిందు ఉత్సవ సమితి ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కోరారు.
ఇసుక పర్మిషన్ ఇస్తాం
తహసీల్దార్ గోవిందమ్మ
దోమ: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక పర్మిషన్‌ను ఇస్తామని తహసీల్దార్ గోవిందమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో ఇందిరమ్మకు ఇసుక గండం అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు మండల రెవెన్యూ గిర్దవారు(ఆర్‌ఐ) సుదర్శన్‌తో పర్మిషన్ ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అర్హులైన వారు పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈలతో సంతకాలు సేకరించి తమ వద్దకు వస్తే ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫేషియల్ రికగ్నిషన్‌తో ఇబ్బందులు
అనంతగిరి: ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ముఖ ఆధారిత హాజరు) సిస్టంతో ఉపాధ్యాయులు అవస్థలు పడే అవకాశం ఉందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, అమర్‌నాథ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగేలా ఈ నియమం ఉందన్నారు. ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడే ఏ అంశానైనా స్వాగతిస్తామన్నారు. కానీ గురువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంతో తొందర వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా హాదీ
అనంతగిరి: ఎంఐఎం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ హాదీ ఎన్నికయ్యారు. పార్టీ అధినాయకుల సూచన మేరకు సమద్ బిన్ అబ్దాద్ సాబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా హాదీతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్ బేగ్, జాయింట్ సెక్రటరీలుగా బహౌద్దీన్ గుల్షాన్, అలీమోద్దీన్, అబ్దుల్ సమద్, మహ్మద్ అలీం, బుర్హాన్ జునైదీ, మోయిజ్ ఖురేషీ, కోశాధికారిగా ఎండీ మహబూబ్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులుగా ఎండీ సర్తాజ్ హుస్సెన్, ఎండీ ఇన్యాతుల్లా షరీఫ్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానన్నారు.

ఎల్‌పీజీ మంజూరు చేయండి

ఎల్‌పీజీ మంజూరు చేయండి

ఎల్‌పీజీ మంజూరు చేయండి