
గాంధీజీ సిద్ధాంతమే మూలం
పరిగి: మహాత్మా గాంధీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకమని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా శుక్రవారం పరిగిలో ఆమె మహిళా కార్యకర్తతో మాట్లాడుతూ.. చెరకతో నూలు వడికి ఉత్సాహ పరిచారు. చరక ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ స్వయం ఉపాధికి చిహ్నమని సూచించారు. చెరక ఉపయోగించే విధానాన్ని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ద్వారా మహిళాల నాయకురాళ్లకు వివరించారు. చేనేత వస్త్రాలు వాడడంతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం దేశ ఆర్థిక పురోగతికి దోహదం అన్నారు.
పుస్తకం అందజేత
దోమ: మహాత్రియా రా రచించిన పోస్ట్ చేయని లేఖ(అన్‌పోస్టేడ్ లేటర్) పుస్తకాన్ని మీనాక్షి నటరాజన్‌కు దోమ మండల మాజీ ఎంపీపీ అనసూయ అందజేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో నిర్వహించి జనహిత పాదయాత్ర సభలో ఆమెకు ఈ బుక్‌ను బహూకరించారు. ప్రతి ఒక్కరూ అన్‌పోస్టేడ్‌లేటర్‌ను చదివేందుకు కృషి చేయాలని మాజీ ఎంపీపీ ఆశించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్

గాంధీజీ సిద్ధాంతమే మూలం