
80 మంది కార్మికుల తొలగింపు
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామ శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోని ప్యాకింగ్ ప్లాంట్‌లో 80 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. దీనిని వ్యతిరేకంగా ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పనుల్లో నుంచి తొలగిస్తే మా జీవితాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ యాజమాన్యం కల్పించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరణప్ప మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులతో వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా కార్మికులకు మద్దతు తెలిపారు.
సీసీఐలో ఆందోళన చేపట్టిన వేతనజీవులు