
వర్షంలో తడుస్తూ.. నిరీక్షణ
పూడూరు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు విద్యార్థులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. మండల పరిధిలోని ఎన్కేపల్లి మోడల్ స్కూల్ వద్ద బస్‌షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక ఇంటికి వెళ్లేటప్పుడు విద్యార్థులు వర్షంలోనే తడుస్తూ బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మోడల్ స్కూల్‌కు వందలాది మంది విద్యార్థులు నిత్యం వస్తున్నా బస్‌షెల్టర్ లేకపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బస్ షెల్టర్ లేక రోడ్డుపైనే విద్యార్థులు