
తెలంగాణ ఏర్పాటు తర్వాతే పంచాయతీలు బలోపేతమయ్యాయని చీమలదరి సర్పంచ్ నాసన్‌పల్లి నర్సింహారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికై న రోజు నుంచి ఇప్పటివరకు పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతోనే అవార్డు దక్కిందని స్పష్టంచేశారు. జిల్లానుంచి జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ఏకై క గ్రామం కావడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి తదితరులు నర్సింహారెడ్డిని అభినందించారు. – అనంతగిరి