 
															తల్లిదండ్రులతో చిన్నారి సాత్విక్
జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి తల్లిదండ్రులు కంచెపోగు కృష్ణ, బిందు ప్రియ, చిన్నారి
కల్లూరు రూరల్(ఖమ్మం): మూడు నెలల పసికందు గుండెలో తీవ్ర సమస్య.. వైద్యం చేయించటానికి లక్షల రూపాయలు వెచ్చించలేని నిరుపేద కుటుంబం. ఈ విషయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నటుడు సోనూసూద్ స్పందించారు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలొని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జులైలో బాబు పుట్టాడు.
మూడు నెలల బాబుకు సాత్విక్ అనే పేరుపెట్టారు. బాబు పట్టుకతోనే  గుండెలో సమస్య ఏర్పడింది. హైదరాబాద్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి సాత్విక్ కు గుండెలో తీవ్ర సమస్య ఉందని, ఆపరేషన్  చేయటానికి రూ.6లక్షలు ఖర్చు అవుతుందని  చెప్పారు. 
(చదవండి: చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం)
చిన్నారి తండ్రి కంచపోగు కృష్ణ హైదరాబాద్‌లోని ఒక ప్రవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నారి బాబు వైద్యం కొసం రూ.6లక్షలు లేక తల్లి తండ్రులు తల్లడిల్లి పోతున్నారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు.
ఆయన  వెంటనే స్పందించి తల్లిదండ్రులు  కంచెపోగు  కృష్ణ, బిందు ప్రియ, చిన్నారి సాత్విక్ ప్రేమ్‌ను ముంబై పిలిపించుకొని  ప్రఖ్యాత  వాడియా ఆస్పత్రిలో సాత్విక్‌కు శనివారం  అత్యంత  కష్టమైన  గుండె ఆపరేషన్  చేయించారు.  చిన్నారి  ఆరోగ్యం బాగుందని, తల్లిదండ్రులు  కృష్ణ, బిందు తెలిపారు. నిరు పేద  చిన్నారి  ఆరోగ్య సమస్యను తెలుసుకొని చలించి పోయి, గుండె  ఆపరేషన్   చేయించిన   నటుడు  సోనూసూద్‌కు కల్లూరు వాసులు  కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
