
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రేలంగి నరసింహారావుగారి 76వ చిత్రం ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి’’ అన్నారు ప్రసన్నకుమార్.