25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ? | Sakshi
Sakshi News home page

Heroines Who Married At Young Age: 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే..

Published Sun, Nov 28 2021 7:21 PM

Heroines Who Married At Young Age - Sakshi

Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట‍్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్‌ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 

అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్‌ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్‌ ఇచ్చిన హీరోయిన్‌లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన‍్లు ఎవరో తెలుసుకుందామా !

1. సాయేషా సైగల్‌

అఖిల్‌, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు.2.  నిషా అగర్వాల్‌

చందమామ కాజల్‌ అగర్వాల్‌ సోదరి నిషా అగర్వాల్‌ సోలో,  సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్‌ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్‌ అగర్వాల్‌ కంటే ముందే డిసెంబర్‌ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 


 

3. షాలినీ

మాధవన్‌ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్‌ బస్టర్‌ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్‌ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది.    


 

4. జెనీలియా

జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర‍్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్‌ క్రేజ్‌ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 


 

5. నజ్రియా నజీమ్‌

రాజారాణి, బెంగళూర్‌ డేస్‌, ట్రాన్స్‌ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌. ప్రముఖ మళయాల నటుడు ఫహద్‌ ఫాజిల్‌ భార్య నజ్రీయా నజీమ్‌. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. 


ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement