సున్నిత అంశాలపై ఆరోపణలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సున్నిత అంశాలపై ఆరోపణలు మానుకోవాలి

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

గత ప్రభుత్వంలో పాలకులు శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలిపారని నానా హంగామా చేయడంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. అలాంటి సున్నితమైన విషయంపై వాస్తవాలు తెలుసుకోకుండా పాలకులు జంతుకొవ్వు కలిసిందని వ్యాఖ్యానించడం బాధాకరం. ఈ విషయంపై ఈడీ విచారణతో వాస్తవాలు బయటపడ్డాయి. నెయ్యిలో జంతుకొవ్వు కలపలేదని అన్ని నిరాధార ఆరోపణలేనని స్పష్టమైంది. ఇప్పటికై నా రాజకీయ పార్టీ నేతలు కలియుగ దైవంతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్‌ టీచర్‌, తిరుపతి

ధర్మం గెలిచింది

వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా శ్రీవారి లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలాంటి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతుకొవ్వు కలిపా రని నిందలు వేశారు. కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం అసత్యమని నెయ్యి లో జంతు కొవ్వు కలవలేదని ఈడీ విచారణలో తేలింది. దీంతో ధర్మం గెలిచిందని నమ్ముతున్నాం. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, టీటీడీ అధికారులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. – రాపూరి ప్రసాద్‌బాబు,

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ మాజీ సభ్యుడు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement