గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందని హంగామా చేసిన కూటమి నేతలకు కనువిప్పు కలిగింది. నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ నిర్ధారించింది. వాస్తవాలను టీటీడీతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం భక్తులకు తెలియజేయాలి. వారు చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రకటించాలి. అప్పుడే పాలకుల నిజాయితీపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పాలకులు వాస్తవాలను ప్రజలకు చేరవేశారని, నిజాయితీపరులని ప్రజలు నమ్ముతారు.
– శివసుబ్రమణ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తమిళనాడు భక్తుడు.
శ్రీవారితో రాజకీయం తగదు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి శక్తితో ప్రపంచం నడుస్తోంది. ఆయనను రాజకీయాలకు అతీతంగా కొలవాలి. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాధపడ్డారు. ఈడీ విచారణలో జంతుకొవ్వు లేదని తేలడం శుభపరిణామం. అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధ కలిగించే విషయం. – పద్మావతమ్మ, భక్తురాలు, తిరుపతి


