నెయ్యిలో జంతు కొవ్వు అంటూ చంద్రబాబు అండ్ కో హంగామా రాజకీయ స్వార్థం కోసం నీలాపనిందలు ఆ ఆనవాళ్లే లేవని నిర్ధారించిన ఈడీ బెడిసికొట్టిన చంద్రబాబు దిగజారుడు డైవర్షన్ డ్రామా భక్తుల మనోభావాలతో ఆటలు మహాపచారం శ్రీవారి భక్తులు, ప్రజా సంఘాలు, మేధావుల ఆగ్రహం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు, కూటమి నేతలు చేసిన దిగజారుడు డైవర్షన్ డ్రామా బెడిసికొట్టింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు కూటమి నేతలు రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడంపై భక్తకోటి ఆగ్రహించింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లే లేవని స్పష్టం చేసింది. శ్రీవారి ప్రసాదంపై కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారని ప్రజా సంఘాలు, మేధావులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా హిందూ భక్తుల ఆరాద్యదైవం శ్రీవారికి రాజకీయాలు ఆపదించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు విరమించుకోవాలని వారు కోరుతున్నారు.
మౌనం వీడి వాస్తవాలు భక్తులకు తెలపాలి
గత ప్రభుత్వ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలను కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో కోడై కూసిన కొన్ని పచ్చ మీడియా యాజమాన్యాలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నాయి. జంతుకొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ సైతం స్పష్టం చేయడంతో వాస్తవాలను ప్రచారం చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నాయో అర్థం కాలేదని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం వంటి అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు మౌనం వీడి దెబ్బతిన్న భక్తుల మనోభావాలపై స్పందించి క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
శ్రీవారి ప్రసాదంపై కూటమి విషం
భక్తులతో పాటు పోటు కార్మికులకు అవమానం
శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరుమలలో లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారు. సాక్ష్యాత్తు సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడడం దారుణం. ఈడీ విచారణతో జంతు కొవ్వు కలవలేదని వాస్తవాలు బయటపడ్డాయి. దుష్ప్ర చారం చేసిన వ్యక్తులు శ్రీవారి భక్తులకు, పోటు కార్మికులకు ఏం సమాధానం చెబుతారు? వాస్తవాలు తెలుసుకోకుండా రాజ కీయ స్వార్థం కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం నిలిపివేసి ప్రజాశ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. – జే విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి


