పింఛన్‌ ఇప్పిస్తేనే బతుకు | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇప్పిస్తేనే బతుకు

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

నాకు ఒక కాలు పూర్తిగా లేదు. మరోవైపు అనేక అనారోగ్య సమస్యలున్నాయి. నా భర్త షేక్‌ అబ్దులా సైతం అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన మేము వైద్య ఖర్చులకు డబ్బులు లేక తిప్పులు పడుతున్నాం. పింఛన్‌ కోసం చాలాకాలంగా అధికారుల వద్దకు తిరుగుతున్నాం. అయినా ఫలితం లేదు. మాకు పింఛన్‌ ఇస్తేనే బతుకు. –షేక్‌ షర్మిల,

దివ్యాంగురాలు, ఎస్‌డీ నగర్‌, తిరుపతి

అనుమతులు వస్తే తెలియజేస్తాం

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే మీడియా ద్వారా జిల్లా ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే కాకుండా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లోనూ పింఛన్ల కోసం అర్జీలు వస్తున్నాయి. అన్నింటిని తీసి పెట్టుకుంటూ సిద్ధంగా ఉంచాం.

– శోభనబాబు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement