ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లండి

Jun 29 2026 5:34 AM | Updated on Jun 29 2026 5:34 AM

తిరుపతి అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ తప్పకుండా వెళ్లాలని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు వెల్లడించారు. ఆదివారం ఆయన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ శారదాదేవితో కలసి తిరుపతి నగరంలోని 39వ వార్డు చెన్నారెడ్డి కాలనీ, 38వ వార్డు కేబీ లేఅవుట్‌, 18వ వార్డు మారుతి నగర్‌ ప్రాంతాలను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు ఆయన పలు సూచనలు చేశారు. 2002 ఓటర్ల జాబితాలో మ్యాపింగ్‌ చేపట్టాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారంలు అందించాలని వివరించారు. డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, అర్బన్‌ తహసీల్దార్‌ సురేష్‌ బాబు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement