చంద్రగిరి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజాత్, జస్టిస్ తుహిన్ కుమార్ శుక్రవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనంగా పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ వేర్వేరుగా దర్శించుకున్నారు.


