అమ్మవారి సన్నిధిలో ‘స్పా’ సెంటర్లా..? | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సన్నిధిలో ‘స్పా’ సెంటర్లా..?

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

రైతుల రక్తం, కన్నీళ్లతో మసాజ్‌లు చేస్తారా..? రూ. 600కోట్లు విలువ చేసే స్థలాన్ని కేవలం రూ. 20కోట్లకే దారాదత్తం కమీషన్ల కోసమే అప్పనంగా 22ఎకరాల కేటాయింపు దైవ క్షేత్రాలను అపవిత్రం చేయాలని చూస్తే సహించం మంత్రి సత్యప్రసాద్‌ వ్యాఖ్యలపై భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం

తిరుపతి మంగళం : తిరుపతి ఆధ్యాత్మిక నగరం, తిరుచానూరు అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోని టూరిజం స్థలంలో ‘స్పా’ సెంటర్లు ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తారా..? అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడి్‌డ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు హైవే పక్కనే ఉన్న టూరిజం స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ కేటాయించడం దుర్మార్గమన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో, కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న 22 ఎకరాల ప్రభుత్వ టూరిజం స్థలాన్ని బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌కు చెందిన సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు లోకేష్‌ అప్పనంగా దారాదత్తం చేశారని మండిపడ్డారు. ఏళ్ల తరబడిగా వారి అధీనంలో పెట్టుకుని సాగు చేసుకుంటున్న సన్నకారు రైతుల కడుపు కొట్టి వారి రక్తం, కన్నీళ్లతో మసాజ్‌లు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎవ్వరబ్బ సొమ్మని రూ. 600 కోట్లు విలువ చేసే 22 ఎకరాల టూరిజం స్థలాన్ని కేవలం రూ.20 కోట్లకే చౌకభేరం పెట్టేశారన్నారు. హైవే పక్కన రూ. 4 కోట్లు భూముల ధర పలుకుతుంటే కేవలం ఎకరా రూ.90 లక్షల చొప్పున 22 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడంలోనే వీరి కమీషన్ల కక్కుర్తి అర్థమవుతోందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు లీజు ధర పెంచడం ఆనవాయితీ అన్నారు. అయితే మూడేళ్లల్లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే ఈ భూమిని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు, స్పా సెంటర్లకు, మసాజ్‌ సెంటర్లకు ఎకరాలు ఎకరాలు కేటాయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement