తొట్టంబేడు: మండలంలోని పెద్ద కనపర్తి, చిన్న కనపర్తి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదీ తీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉచితం మాటున వందల ట్రాక్టర్ల ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పక్కా గృహం కూడా మంజూరు చేయలేదు. అయినా ఇతరత్రా నిర్మాణాల పేరుతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.
చైన్నెకి తరలింపు
ఇక్కడి నుంచి ఇసుక తవ్వి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెంకటగిరి, శ్రీసిటీ, తిరుపతి– సత్యవేడు మీదుగా చైన్నెకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చరేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


