నగరంలో ఇటీవల బయటపడిన కుళ్లిన మాంసం, చేపలను చూసి భయపడ్డాం. ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి ఆహారాన్ని విక్రయిస్తున్నారా అని విస్తుపోయాం. అందుకే పల్లెల్లో తాజాగా దొరికే నాటుకోడి లైవ్ తీసుకునేందుకు ఆదివారం మేము మా స్నేహితులం పల్లెబాట పట్టాం.
– సుబ్రమణ్యం, స్థానికుడు, తిరుపతి
తక్కువకే బిర్యానీ అంటూ దగా
నగరంలో కొన్ని మటన్ దుకాణాలు, హోటళ్లు వ్యాపారం కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవడం దారుణం. రూ.60 నుంచి రూ.100కే బిర్యానీ అంటూ కుళ్లిన మాంసంతో ఆహార పదార్థాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరిన్ని తనిఖీలు జరగాలి.
– చంద్రశేఖర్, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి


