రాష్ట్రంలో | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

● సాయికృష్ణ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలి ● సాయికృష్ణ, క్రాంతికుమార్‌, గంగమ్మ హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి ● రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో చంద్రబాబు, పవన్‌కళ్యాన్‌, లోకేష్‌ రాక్షస పాలన ● తిరుపతిలో మానవహక్కులకు న్యాయ పోరాట ర్యాలీ ● భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌ – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు
జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థినులను శనివారం కలెక్టర్‌ కలెక్టరేట్‌లో అభినందించారు.
‘కూటమి రాక్ష పాలనలో కాపులు, దళితులకు రక్షణ కరువైంది.. పచ్చనేతల దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, లైంగిక దాడులకు బలవుతున్నారు. ప్రగల్భాలు పలికే పవన్‌ నోట మాట రావడం లేదు. ఈ స్థితిలో కాల కూటమి నుంచి వారిని రక్షించడంతోపాటు మానవ హక్కుల పరిరక్షణకు వైఎస్సార్‌ సీపీ ఉధృత పోరాటం చేస్తోంది.’ అని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

కూటమి పాలనలో గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

15 ఉద్యోగసంఘాలతో సమీక్ష

తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టరేట్‌ 15 ఉద్యోగ సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితో చర్చించారు.

ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2026

గాంధీరోడ్డులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పార్టీ శ్రేణులు

ర్యాలీలో పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్‌ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి

తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన కాపు నాయకుడు సాయికృష్ణ, దళితులు క్రాంతికుమార్‌, గంగమ్మను పోలీసులు దారుణంగా హింసించి చంపిన ఘటనలపై శనివారం వైఎస్సార్‌ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని అనంతవీధి నుంచి చిన్నబజారువీధి, గాంధీరోడ్డు వరకు మానవహక్కులకు న్యాయపోరాట ర్యాలీని భారీగా నిర్వహించారు. ర్యాలీలో భూమన కరుణాకరరెడ్డితోపాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్‌ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు నీలం బాలాజీతోపాటు పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీరోడ్డులో రోడ్డుపై బైఠాయించి మానవహక్కులను పరిరక్షించాలని, సాయికృష్ణ, క్రాంతికుమార్‌, గంగమ్మ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలేనన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌, గంగమ్మ మృతులకు కారకులైన పోలీసులలో కేవలం నాగరాజు అనే సీఐని మాత్రమే సస్పెండ్‌ చేస్తే సరిపోదని ఎస్పీ కూడా బాధ్యులేనన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని చంద్రబాబు కలిసి బేరసారాలతో సమస్యను సర్దుబాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరాచకాలపై వైఎస్సార్‌సీపీ పోరాటాలు సాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌, గంగమ్మ మరణాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన పోలీసులను విడిచిపెట్టమని హెచ్చరించారు.

హత్యలే రెడ్‌బుక్‌కు నిదర్శనం

భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోందనడానికి సాయికృష్ణ లాకప్‌ డెత్‌, దళితులైన క్రాంతికుమార్‌, గంగమ్మల హత్యలే నిదర్శనమన్నారు. సాయికృష్ణను పోలీసులు పోలీస్‌స్టేషన్‌ చంపి, బయట తీసుకెళ్లి బూడిద కూడ మిగల్చకుండా కాల్చేశారంటే ప్రభుత్వ అండదండలతోనే పోలీసులు ఇంతకు తెగించారన్నారు. వీరి హత్యలకు హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలను చూస్తే రాష్ట్రంలో పూర్తిగా మానవహక్కులు ఉల్లంఘన అయ్యాతున్నాయన్నారు. పోలీసులు తప్పు చేస్తే పోలీసులచే విచారణ జరిపిస్తే ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వీటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement