ఎట్టకేలకు 24 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు 24 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

● రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు చెల్లింపు – జూన్‌ 24 నుంచి 30వ తేదీ వరకు ● ధ్రువపత్రాల పరిశీలన–జూన్‌ 25 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ● వెబ్‌ ఆప్షన్ల ఎంట్రీ – జూన్‌ 29 నుంచి జూలై 3వరకు ● వెబ్‌ ఆప్షన్ల మార్పుకు అవకాశం – జూలై 4వ తేదీ ● సీట్‌ అలాట్‌మెంట్‌ – జూలై 6వ తేదీ ● కళాశాలల్లో తరగతులు ప్రారంభం– జూలై 7వ తేదీ

తిరుపతి సిటీ: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎట్టకేలకు 24వ తేదీ నుంచి పాలిసెట్‌–2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరపనుంది. గత ఏప్రిల్‌ 25వ తేదీన జరిగిన పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు మే 5వ తేదీన విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు 45 రోజులపైన గడుస్తున్నా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టకపోడంతో జిల్లాలో పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన సుమారు 4,438 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ తేదీలను ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

కౌన్సెలింగ్‌ ప్రక్రియ తేదీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement