విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

తిరుపతి అర్బన్‌: జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థి రేష్మ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌ జాతీయ పోటీల్లో గెలుపొందారు. దీంతో ఆ విద్యార్థిని ఈ నెల 28 నుంచి జూలై 4 వరకు జపాన్‌ దేశంలో సకురా పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆమెను అభినందించి, ఆశీర్వదించారు. అనంతరం రేష్మకు సీతారాముల కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. అలాగే తిరుచానూరులోని భువ నేశ్వరి విద్యానికేతన్‌లో పదో తరగతి చదువుతున్న ఎం.ధన్యశ్రీ ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన పెయింటింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే ఎం.ధన్యశ్రీ శనివారం కలెక్టర్‌ పెన్సిల్‌ ఆర్ట్‌ చిత్రాన్ని కలెక్టర్‌కు బహూకరించా రు. అలాగే చిన్నారిని అభినందించి, వెంకటేశ్వరస్వామి కాంస్య విగ్రహాన్ని బహూకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement