రేణిగుంట: మండలంలోని చెంగారెడ్డిపల్లిలో రేకుల షెడ్లు నిర్మాణంలో కూలి పనులు చేస్తున్న ఓ మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అతని భార్య కష్ణవేణి (28) రేణిగుంటలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం చెంగారెడ్డిపల్లెలో పని స్థలంలో నీటి మోటారు ఆఫ్ చేయడానికి వెళ్లిన కష్ణవేణి తిరిగి రాకపోవడంతో, ఆమె భర్త వెళ్లి చూడగా మోటారు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించి, వెంటనే స్థానికుల సహాయంతో కరకంబాడిలోని అమర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


