తిరుపతి అర్బన్: జాతీయస్థాయిలో 2026–27కి సంబంధించి జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యా సంస్థలు సత్తా చాటాయని ఆ సంస్థ అధినేత విశ్వనాథ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మూడో విడత ఫలితాలు విడుదల చేశారని చెప్పారు. విశ్వం వి ద్యా సంస్థల్లో శిక్షణ పొందిన పద్మిని, చైతన్య నా యక్, ఇందు, బద్రీనాధ్, శాంతికుమారి ఇ, గోమతి, హర్ష, నవనీష్, భావన, సుహాన్ తదితరులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. మూడో విడ త ఫలితాలతోపాటు 1, 2 విడతల ఫలితాలను కలుపుకుంటే మొత్తంగా 69 మందికి ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. దశాబద్దాలుగా విశ్వం విద్యా సంస్థలు నవోదయతోపాటు సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఏటా ర్యాంకులు సాధిస్తుందన్నారు. నవోదయ, సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోరుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలన్నారు.


