తోతాపురి.. | - | Sakshi
Sakshi News home page

తోతాపురి..

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

ఎప్పుడు కొంటారు సారూ! సీజన్‌ అయిన తర్వాత కొంటాయా? 45వేల టన్నుల పల్ప్‌ నిల్వలు లక్ష ఎకరాల్లో మామిడి సాగు తోతాపురి రకం 70వేలు ఎకరాల్లో సాగు అందుబాటులోకి రాని ఫ్యాక్టరీలు జిల్లాలో 9 పల్ప్‌ ఫ్యాక్టరీలు

తిరుపతి అర్బన్‌: మామడి రైతుల భవిష్యత్‌ ఈ ఏడాది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. తాము పండించిన మామడి పంటను అమ్ము కోవడానికి రైతులు గత ఏడాది నానా తిప్పులు పడిన సంగతి తెలిసిందే. మామిడి కొనుగోలు చేసేవారు లేక కొందరు రైతులు ఉచితంగా గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాగే మామిడి సాగు వృథా అని కొందరు మామిడి చెట్లను తొలగించారు. గత ఏడాది ఫ్యాక్టరీలు తోతాపురికి కిలోకు రూ.8 ఇస్తారని, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని, మొత్తంగా కిలోకి రూ. 12 గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారు. అయితే పలుచోట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.4 మాత్రమే ఇచ్చినట్లు రైతులు వాపోతున్నారు. గత ఏడాది పెద్ద ఎత్తున సమస్యలు వచ్చాయి. ఈ ఏడాదీ అలాంటి ఇబ్బందులు తిరిగి చోటుచేసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు.

నిద్రావస్థలో ఉద్యానశాఖ

గత ఏడాది నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టం అవుతోంది. రాష్ట్రస్థాయిలో గత ఏడాది మామిడి సమస్యలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టమవుతోంది. ఈ ఏడాది కిలోకి రూ.7 చొప్పున ఫ్యాక్టరీల నుంచి ఇప్పిస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వం నుంచి పైసా లేదు

మామిడి సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది కంటే ధర పెంచి ఇవ్వాల్సి ఉంది. అయితే తగ్గించి ఇస్తామని చెప్పడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement