చెరువులో దొంగలు పడ్డారు! | - | Sakshi
Sakshi News home page

చెరువులో దొంగలు పడ్డారు!

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

– 8లో

జువ్వలపాళెం చెరువులో రాత్రి వేళలో అక్రమార్కులు దొంగల్లా మట్టి తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

టీటీడీ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీలో అక్రమాలు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: టీటీడీలో కొత్తగా తెరపైకి వచ్చిన ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీ అక్ర మాల వివాదంపై విచార ణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయ న తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ ఇంజినీరింగ్‌ విభాగంలో ఏఈఈ 27, ఏఈ 10, ఏటీఓ 19, విద్యుత్‌ జేఈ 4 మొత్తం 60 పోస్టులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే 2023 నవంబర్‌ 23న నోటిఫికేషన్‌ ఇచ్చాం. 30 వేల దరఖాస్తులు వచ్చాయి. రాయలసీమ వా సులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పట్లో తాత్కాలికంగా నోటిఫికేషన్‌ నిలిపివేశాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక, బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ అయిన ఏడాదిన్నర తర్వా త అంటే గత మే 10, 11న అవే పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. లీగల్‌ సమస్యలు తలెత్తుతాయని తమ పాలనలో నోటిఫికేషన్‌ నిలిపివేస్తే, అదే నోటిఫికేషన్‌ ఇప్పుడు యథావిధిగా ఇచ్చారు. 2 పోస్టులకు, 3 మూడు పోస్టులకు గత ప్రభుత్వంలో ఒకే చోట పరీక్ష రాసే అవకాశం ఇచ్చాం. అయి తే ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపి, అవకాశం ఇవ్వలేదు. సెంట ర్లు మార్పు చేయడంతో 18 వేల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. టీటీడీ చైర్మన్‌, ఆయనకు కొమ్ముకాసే ఇద్ద రు సభ్యుల సహకారంతో ఒక్కో పోస్టును రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు అమ్ముకున్నారనే చ ర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరి ష్కరించకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే 20 24–25లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారికి అవకా శం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్‌గా పరిగణించడంతో రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. సీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆరోజు నోటిఫికేషన్‌ రద్దు చేశాం. ఇప్పుడు టీటీడీ చెర్మన్‌ బీఆర్‌ నాయుడు, టీడీపీ వాళ్లు డబ్బులు దండుకున్నారు. గత ప్రభుత్వంలో 60 పోస్టుల భర్తీ బాధ్యతను మద్రాస్‌ ఐఐటీ వాళ్ల కు అప్పగించాం. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ సా గాలని ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం.’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement