ప్రకృతి పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, దీనిని కాపాడుకుంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ జిల్లా మూలపాడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి కపీలతీర్థం సమీపంలోని నగరవనంలో అధికారులు, విద్యార్థులు, వాకర్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ పవన్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓలు సుదర్శన్‌ రెడ్డి, మాధవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement