తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు తిరుపతికి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొండూరు మోహన్ కుమార్ రాజు కుమార్తె డాక్టర్ శ్రావ్య రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాత తల్లిదండ్రులు సుధా, మోహన్ కుమార్ రాజు, భర్త యుగంధర్ చేతుల మీదుగా డీడీని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో విరాళం ఇచ్చానని చెప్పారు. తన వ్యక్తిగత, కుటుంబ ఉన్నతితో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


